Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో స్మశానవాటికని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేపట్టాలి

ధర్మవరం డివిజన్ నందు అర్హులందరికీ ఇంటి గృహ నిర్మాణాలకు అందజేయడానికి చర్యలు చేపట్టాలి

ధర్మవరం నియోజకవర్గ నందు పలు చెరువులు అభివృద్ధి చేయడానికి ఎంత నిధులు అవసరమో నివేదికల సిద్ధం చేయాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర -ధర్మవరం; మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గం నందు చెరువుల అభివృద్ధి చేయడానికి ఎంత మేరకు నిధులు అవసరమో నివేదికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచే దిశగా ప్రతి శాఖ కూడా సక్రమంగావ్యవహరించాలని సూచించారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమన్వయంతో పనిచేస్తే అన్ని కార్యక్రమాలూ విజయవంతంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముదిగుబ్బ మండలంలోని యోగి వేమన రిజర్వాయర్ ప్రాజెక్టును సుమారు 60 లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 85 చెరువులలో అభివృద్ధి చేయడానికి 96 పనులు ఆమోదించి ప్రభుత్వానికి 179.9 లక్షల రూపాయలు నిధులు అవసరమని నివేదికలు అందజేశా మన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ ద్వారా 21 చెరువుల అభివృద్ధి చేయడానికి 795 లక్షల రూపాయలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికల సమర్పించడం జరిగిందని తెలిపారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ ద్వారా, పీఏబీఆర్ ద్వారా కాలువల ద్వారా 14 చెరువులు నీరు అందజేయుచున్నామని తెలిపారు. నియోజకవర్గంలో తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం అర్బన్ నందు తీవ్ర నీటి ఎద్దడి నివారణ కొరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, రక్షిత నీటి పథకాలు సమగ్రంగా సమీక్షించారు. ధర్మవరం మున్సిపాలిటీ నందు ఉన్న స్మశాన వాటికి అభివృద్ధి చేయడానికి హైదరాబాదులో ఉన్న మహాప్రస్థానం లాగా తీర్చిదిద్దడానికి అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఎజెండా అని తెలిపారు.రాబోయే 5 సంవత్సరాల కాలంలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఇది వరకే లబ్ది పొందిన వారి పునాదులకు ఇంటి నిర్మాణం జరిగిన వారందరిని ఇంటిని నిర్మించడానికి సంబంధ శాఖ అధికారులతో కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 15,830 ఇల్లు నిర్మాణాలు నిర్మించడానికి ఆమోదం తెలిపి ఉన్నామని, నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతాలలో 13 వేల ఇల్లు నిర్మాణాలు పనులు దశలవారుగాజరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాస్, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ఎంపీపీ ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఆర్డీవో మహేష్, మైనర్ ఇరిగేషన్ అధికారి విశ్వనాథరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి మల్లికార్జునప్ప, హౌసింగ్ అధికారి శంకరయ్య, ఎస్ సి పి ఆర్ మురళీమోహన్ నేషనల్ హైవేస్, హార్టికల్చర్ అధికారులు, ఆర్ అండ్ బి నేషనల్ హైవే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు