విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో ఉన్న జగనన్న కాలనీలో ఇటుకలు, ఇసుక, కంకరను దొంగలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బొగ్గుల నరసన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జగనన్న కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న బేస్ మెంట్ లో ఉపయోగించిన ఇటుకలు, ఇసుక, కంకరను దొంగతనానికి గురైనట్లు ఆయన తెలిపారు. నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేయడంతోనే అధికారుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే దొంగతనాలు జరిగాయన్నారు. కావున తక్షణమే జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్, హౌసింగ్ పీడీ, డీఈ స్పందించి జగనన్న కాలనీలో దొంగలించిన ఇటుకలు, ఇసుక, కంకరను రికవరీ చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.