Friday, February 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంనిరుద్యోగులపై కపట ప్రేమ ఆపండి

నిరుద్యోగులపై కపట ప్రేమ ఆపండి

రాయలసీమ జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి…
ఏఐవైఎఫ్ ఏ పి ఆర్గనైజింగ్ కార్యదర్మి జి.సంతోష్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : నిరుద్యోగులపై కపట ప్రేమ ఆపాలని, రాయలసీమ జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ఏ పి ఆర్గనైజింగ్ కార్యదర్మి జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.
అఖిల భారత యువజన సమాఖ్య,(ఏఐవైఎఫ్) అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్మి జి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ… అమరావతి ఫ్రీజోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను. గ్రూప్ 1 3 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా ఇయర్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు . విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి ప్రైవేటీకరణను విరమించుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడలు నిర్వహించి వారి ఉపాధికి తోడ్పడాల్సిన అవసరం ఉందన్నారు . కల్తీ ఆహారాలపై నిబంధనలు విధించి కల్తీ ఆహారాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలన్నారు. ఆన్లైన్ రమ్మీ బెట్టింగ్ యాప్స్ రద్దు చేయాలని ఆన్లైన్ మోసాలను అరికట్టే విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లను కొనసాగించి రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. వైస్ ఛాన్సలర్ పోస్టులలో కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని నివారించి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ చర్యలు భాగంగా విద్యార్థుల కు మానసిక ఒత్తిడి తట్టుకోనే విధంగా విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు ప్రారంభించి యోగా పోస్టులను ఆయా పాఠశాలల్లోన కళాశాలలో భర్తీ చేయాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్,బిహెచ్ఎల్ గ్యాస్, ఆయిల్ ఒక్కో వివిధ సంస్థలలో ప్రైవేట్ పెట్టుబడులను విరమించి కేంద్ర ప్రభుత్వమే కొనసాగించాలన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ చట్టం తీసుకువచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నకిలీ ఆర్ఎంపీలను గుర్తించి చర్యలు చేపట్టి, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీలపై ప్రత్యేకంగా అధిక ఫీజులను నియత్రించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. గంజాయి మత్తు పదార్థాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం నిర్వాసిత బాధితులను ఆదుకొని ప్రతి ఇంటికి ఉద్యోగం నష్టపరిహారం అందించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పలు 32 తీర్మానాలతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నా మని రానున్న కాలంలో ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుద్యోగులను విద్యార్థులను ప్రజలను ఆదుకోకపోతే అఖిల భారత యువజన సమైక్యంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయడానికి ఏప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాని కి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్అధ్యక్షుడు కోటేష్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, సహాయ కార్యదర్శి ధనుజయ, కోశాధికారి శ్రీనివాస్, ఉరవకొండ మండల కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు