డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలైన వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ,ఎక్స్ (ట్విట్టర్) ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అనుచిత, అనైతిక అవమానకర రీతిలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. రాజకీయంగాను, కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా, రెచ్చగొట్టే వాక్యలు, దుష్ప్రచారం ,మతపరమైన సున్నిత అంశాల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు లేదా తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టడం, షేర్ చేయడం, అనుచిత, అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించడం, సహకరించడం వంటివి కూడా చట్టరీత్యా నేరం అవుతుందని తెలిపారు. ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిపై అనుక్షణం పోలీస్ నిగా ఉంటుందని వారు తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించి, అట్టి వారిపై కేసులు కూడా తప్పక నమోదు చేస్తామని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..
RELATED ARTICLES