Monday, April 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగొడవలు, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

గొడవలు, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని టూ టౌన్ పరిధిలో రౌడీ షీటర్లు గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు అని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో
రౌడీషీటర్లకు సిఐ రెడ్డప్ప కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. ఎవరైనా గొడవలకు వెళ్లినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొడవలు, అల్లర్లను ప్రోత్సహించినట్లు తెలిసినా కూడా మీపై చర్యలు తప్పవని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. అసాంఘిక కార్య కలాపాల జోలికి వెళ్ళరాదని, చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు. రౌడీ షీటర్ల పై తాము ప్రత్యేక నిఘా కూడా ఉంచినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు