విశాలాంధ్ర ధర్మవరం; డివిజనల్ పరిధిలో ఎక్కడా కూడా బాల్యవివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో సమావేశ భవన్లో బాల్య వివాహ నిరోధక చట్టం-2006, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల్య వివాహ నిరోధక చట్ట నిబంధనలు-2023 పై అవగాహన సదస్సుతోపాటు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య వివాహాల వలన నష్టమే తప్ప లాభం ఉండదని, తల్లిదండ్రులకు అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వివాహ వయస్సు వచ్చినప్పుడే బాలికలకు వివాహం జరిపించాలని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా సరే బాలు వివాహాలు జరుగుతున్నాయన్న సమాచారం అందినచో ఆలస్యం లేకుండా ఆ బాల్య వివాహాలను ఆపే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని వారు గుర్తు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం వారు నూతనంగా జీవో నెంబర్ 39 ప్రవేశపెట్టిందని దీని ప్రకారం తీసుకోవలసిన చర్యలు గురించి తాను వివరించడం జరిగిందని తెలిపారు. వివిధ విభాగాల అధికారులకు బాల్యవివాహాలను అరికట్టేందుకు మా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ తో పాటు డివిజన్ పరిధిలోని వివిధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.. ఆర్డీవో మహేష్
RELATED ARTICLES