Homeఅంతర్జాతీయంసొంత దేశంలోనే ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత.... తాజా సర్వే వెల్లడి

సొంత దేశంలోనే ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత…. తాజా సర్వే వెల్లడి

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఏ ప్రజలైతే అత్యధిక ఓట్లు వేసి ఎన్నుకున్నారో ఇప్పుడు 8 నెలల తర్వాత వారే ఆయన మాకు వద్దంటున్నారు.తాజాగా నిర్వహించిన సర్వేలో దాదాపు 57 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పై వ్యతిరేకత ప్రకటించారు గతంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఎవరికీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురుకాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేవలం 12 శాతం మంది మాత్రమే ట్రంప్‌ను ‘అద్భుతమైన అధ్యక్షుడు గా భావిస్తుండగా.. 53% మంది ఆయనను ‘విఫల అధ్యక్షుడు్ణ గా ముద్ర వేశారు. ట్రంప్ ఆమోదం రేటింగ్ 39 శాతానికి పడిపోగా.. వ్యతిరేకత 58 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వలస వ్యతిరేక విధానాలు, హెచ్-1బీ వీసా నిబంధనల కఠినత, మరియు వాణిజ్య యుద్ధం వంటి నిర్ణయాలపై అమెరికన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది ‘లిబరేషన్ డే్ణ పేరుతో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వికటించాయి. స్వదేశంలోనూ దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ప్రతిపక్ష డెమొక్రాట్ల నియంత్రణలో ఉన్న నగరాల్లో ‘నేషనల్ గార్డ్ ను మోహరించడం వంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను మరింత పెంచాయి. ప్రజాదరణ పడిపోతుండటంతో 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సెనేట్ డెమొక్రాట్ల వశమైతే తనపై అభిశంసన వేటు పడే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను హెచ్చరించడం అక్కడి రాజకీయ వేడిని సూచిస్తోంది.

ట్రంప్ యంత్రాంగం దిద్దుబాటు చర్యలు..
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని గమనించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు వ్యూహాలు మారుస్తోంది. మిన్నెసోటాలో వలసదారులపై అణిచివేతను ఆపడం, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను తగ్గించడం వంటి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఈ చర్యలు ఓటర్ల మనసు మార్చలేవని తాజా పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు