Friday, January 10, 2025
Homeజిల్లాలుబాపట్లపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం

మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌
విశాలాంధ్ర బ్యూరో – బాపట్ల : పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయం కార్మిక సంఘం ఆద్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ తెలిపారు. బాపట్ల జిల్లాలో శుక్రవారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ జిల్లా వ్యాప్తంగా తహశీల్దారు కార్యాలయం వద్ద సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో అర్హులతో కలిసి వ్యక్తిగత అర్జీలను అందజేశారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని బాపట్ల ప్రధాన రహదారిలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పార్టీ నాయకులు, వందాలాది మంది అర్హులైన అర్జీదారులతో కలిసి ప్రదర్శన చేస్తూ తహశీల్దారు కార్యాలయంలో అర్జీదారులతో కలిసి వ్యక్తిగత అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్‌ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్థాలు గడిచిన పేదలు నివాసం ఉండేందుకు నేటికి ఇళ్ల స్థలాలకు పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగటం విచారకరం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ప్రజల ఆర్ధికాభివృద్ధికి జీవన స్థితిగతులు మార్చేందుకు చర్యలు తీసుకోవటంలో నానాటికి విఫలమవుతుందన్నారు. ఒకే ఇంటిలో నాలుగు ఐదు కుటుంబాలు కలిసి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వాలు ఆలోచన చేయటంలేదన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు అధికారం వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు నివేశన స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు గత నవంబర్‌ 18వ తేదీన గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నేడు అన్నీ తహశీల్దారు కార్యాలయ వద్ద అర్హులతో కలిసి వ్యక్తిగత అర్జీలు ఇస్తున్నామన్నారు. పేదల ప్రజలకు నివేశన స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విల్సన్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్‌, నియోజకవర్గ కార్యదర్శి బక్కా రామకృష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శి ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, ముత్తిరెడ్డి శ్రీనివాసరావు తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు