Homeజిల్లాలుకర్నూలుఎస్ టి యు–2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

ఎస్ టి యు–2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆస్పరి మండల శాఖ ఆధ్వర్యంలో 2026 ఎస్ టి యు డైరీ, క్యాలెండర్‌లను మండల విద్యాశాఖ అధికారులు రాజేంద్రప్రసాద్, తిరుమలరావు లు శుక్రవారం స్థానిక ఎంఆర్పీ సెంటర్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎస్టియు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు రాజేంద్రప్రసాద్, తిరుమలరావు మాట్లాడుతూ 79 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉపాధ్యాయ సంక్షేమంతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌లను తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఎస్టియు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నాగేంద్రప్ప, రాష్ట్ర కౌన్సిలర్ నరసింహులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గానికి ప్రతి దశలో ఉపయోగపడే విధంగా ఎస్టియు–2026 డైరీని శ్రద్ధతో రూపొందించడం జరిగిందని, ప్రతి ఉపాధ్యాయుడు ఈ డైరీని వినియోగించుకోవాలని సూచించారు. ఈ డైరీ ఉపాధ్యాయులకు వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల అధ్యక్షుడు ఉరుకుందు, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, సీనియర్ నాయకులు శ్రీనివాసులు, విశ్వనాథ్, లక్ష్మీపతి, జ్యోతి మూర్తి, నాగరాజు, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు