ప్రిన్సిపాల్ మహాలక్ష్మి దేవి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఇంటర్ పరీక్ష ఫలితాలలో మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ మహాలక్ష్మి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థులు జిల్లా టాపరుగా మొదటి సంవత్సరములోనే సాధించడం జరిగిందని తెలిపారు. సెకండ్ ఇయర్ బైపిసి లో ఎస్. పల్లవి 958 మార్కులు, సీఈసీ లో డి.జీవన లో 950 మార్కులు, ఎంపీసీ రుమానా 936 మార్కులు, హెచ్ఈసి లో మహేశ్వరి 908, ఎమ్మెల్సీ టి లో రూప 956, ఓఏలో ఆస్మా904, ఎం పి హెచ్ డబ్ల్యు మమత 954 మార్కులు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రధమ సంవత్సరంలో ఎస్.భవాని ఎంపీసీలో 461, బైపీసీలో ఎస్. సాయి శిల్ప 429, ఎం. నాగ హారిక, సీఈసీ లో 420, మార్కులు సాధించడం జరిగిందన్నారు. ప్రథమ సంవత్సరంలో 69 శాతము, ద్వితీయ సంవత్సరంలో 85.1 శాతము సాధించడం జరిగిందన్నారు. మంచి ప్రతిభ ఘనపరిచిన విద్యార్థినిలందరికీ కూడా ప్రిన్సిపాల్ మహాలక్ష్మి దేవి, కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్, అధ్యాపకులు హాజీపీరా, పెద్దన్న, రామానుజుల రెడ్డి, ప్రభాకర్, బోధ నేతల సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంటర్ లో సత్తా చాటిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..
RELATED ARTICLES