Friday, April 25, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరిపదిలో పెదతాడేపల్లి గురుకుల విద్యార్థుల ప్రభంజనం

పదిలో పెదతాడేపల్లి గురుకుల విద్యార్థుల ప్రభంజనం

విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం రూరల్ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేధ్కర్ పెదతాడేపల్లి గురుకుల విద్యార్థులు విజయఢంకా మోగించారు. పాఠశాల నుంచి 76 మంది పరీక్షలకు హాజరుకాగా 73 మంది ఉత్తీర్ణత సాధించారని పాఠశాల : ప్రిన్సిపాల్ బి.రాజారావు శుక్రవారం తెలిపారు. 73 మందిలో 550 మార్కులకు పైగా 8 మంది విద్యార్థులు సాధించారన్నారు. 27 మంది విద్యార్థులు 500లకు పైబడి మార్కులు సాధించారని తెపారు. పాఠశాల నుంచి వై.అవినాష్ 574 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచారన్నారు. ఎస్.రాఘవ 572 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో, కె.రంజిత్ కుమార్ 560 మార్కులు సాధించి తృతీయస్థానంలో నిలిచారన్నారు. ఈ సందర్భంగా పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, సమగ్రశిక్ష ఎపిసి శ్యామ్ సుందర్, గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారి బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రతాప్, ఉపాధ్యాయులు యం.వి.బాలాజీ, ఎస్.ఆనంద్, వి.బలరామ్, తోటి విద్యార్ధులు, సిబ్బంది అభినందించారు. ఉపాధ్యాయుల నిరంతర కృషి, విద్యార్థుల సహకారంతోనే విజయంతోనే పది ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపాల్ రాజారావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు