విశాలాంధ్ర ధర్మవరం : ఇటీవల కొత్త చెరువులోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే విజ్ఞాన వారోత్సవాల్లో పట్టణంలోని శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల సుందరయ్య నగర్ కు చెందిన విద్యార్థులు అన్ని కేటగిరీలలో మంచి ప్రతిభతో పాటు బహుమతులను కూడా పొందడం జరిగిందని హెడ్మాస్టర్ బిల్లే భాస్కరయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో 8వ తరగతికి సంబంధించి డ్రాయింగ్ పోటీలలో ప్రథమ బహుమతిని కె తేజేశ్వర్, క్విజ్ పోటీలలో ప్రథమ బహుమతిని ఎస్ కార్తికేయ, వ్యాసరచన పోటీల్లో మూడవ బహుమతి పి నవ్జియా, ఎలోకేషియన్ పోటీల్లో రెండవ బహుమతి సి లాస్య, ఆరవ తరగతి కి సంబంధించి ఎలోకిషన్ ఫస్ట్ ప్రైజ్ లో, ఏడవ క్లాసుకు సంబంధించి ఎ లొకేషన్ రెండవ ప్రైజ్ బి హేమంత్ బహుమతులు పొందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బహుమతులు పొందిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల హెడ్మాస్టర్ భాస్కరయ్యతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు రామకృష్ణ, హనుమంతులు ,హరికృష్ణ ,రామ్మోహన్, రాము, నాగమణి తదితరులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రీడల్లో ప్రతిభ చాటిన శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


