వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కోరి
విశాలాంధ్ర అనంతపురం : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కోరి మాట్లాడుతూ… యావత్ మానవ గౌరవం కోసం పాటుపడిన డా. బి ఆర్. అంబేద్కర్ స్ఫూర్తిని అలవర్చుకోవాలని విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గం భారత దేశాన్ని,ప్రజాస్వామ్యాన్ని స్థిరమైన మార్గం లో నడిపిస్తుందని తెలియజేశారు. యూనివర్సిటీ ఇంచార్జి రిజి స్ట్రా ర్ ప్రొఫెసర్. సి. షీలారెడ్డి మాట్లాడుతూ… అంబేద్కర్ ను సరైన దృక్పథం తో అర్ధం చేసుకోవాలని, అంబేద్కర్ అంటే అందరి వాడని విద్యార్థుల కు హితవు పలికారు. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రాజేష్ కోట కోఆర్డినేట్ చేయగా, అనేక మంది అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.