విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర బాబు అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల, డ్రగ్స్ నివారణ, క్రమశిక్షణలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఈవ్ టీజింగ్, డ్రగ్స్ వంటివి వాటికి దూరంగా ఉండాలని, వాటి వల్ల కేసులు నమోదై జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ఆకర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నిరంజన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ రంగన్న, అధ్యాపకలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.