విశాలాంధ్ర- ఆగిరిపల్లి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఈదర ప్రధాన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్కే వేణుగోపాలరావు పేర్కొన్నారు. ఈదర మండల పరిషత్ ప్రాథమిక ప్రధాన పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గం.9లకు తల్లిదండ్రులను ఆహ్వానించడం తో కార్యక్రమం ప్రారంభమైంది. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని వివరించారు. తండ్రులకు టగ్ ఆఫ్ వార్,తల్లులకు రంగోలి పోటీలను నిర్వహించడం జరిగింది.పూర్వ విద్యార్థి గరిసేపల్లి రాంబాబు తన విజయగాధను తెలిపారు.సచివాలయం మహిళా పోలీస్ బండారు భవాని సైబర్ నేరాలు జరుగుతున్న విధానం,తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎస్ సుబ్బారెడ్డి మిడ్ డే మీల్స్ నాణ్యత గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు మధ్య వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్య పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని పర్యవేక్షించాలని సూచించారు. విద్యా విధానంపై తల్లిదండ్రులు సలహాలు సూచనలు అందజేయాలని కోరారు.అనంతరం వచ్చిన అతిథులకు భోజనాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఎం నిర్మల దేవి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వడపర్తి రమేష్,వైస్ చైర్మన్ గుర్రం నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ దిడ్డి సునీత, ఏఎన్ఎం లక్ష్మి,లలిత, అనసూర్య,పూజిత,రంగమ్మ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలపై ఆసక్తి చూపాలి…
RELATED ARTICLES