Tuesday, April 22, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావిద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి…

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి…

ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ :-విద్యార్థినీ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకునీ ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు మండల పరిధిలోని లింగాలపాడు గ్రామం నందు 4 లక్షల 25 వేల రూపాయల అంచనాతో పీ ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అభివృద్ధి పరచిన క్రీడా మైదానాలను విద్యార్థిని విద్యార్థులు స్కూల్ యాజమాన్యం మరియు కూటమి నేతలతో కలసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం,క్రీడలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తంగిరాల సౌమ్య తెలియపరిచారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపల పాఠశాలలకు అందుతాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం లో 6,7,8,9 తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు హోలిస్టిక్ కార్డులను స్కూల్, అధ్యాపకులు మరియు సిబ్బంది కలిసి పంపిణీ చేశారు.తరగతి వారీగా ప్రధమ ద్వితీయ తృతీయ స్థానం పొందిన విద్యార్థి విద్యార్థులను తంగిరాల సౌమ్య అభినందించినారు.పాఠశాల ఇతర అవసరాలు అభివృద్ధికి తన కృషి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వీరస్వామిన్,కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు