చేనేత ప్రముఖుడు సందా రాఘవ
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులందరూ కూడా చదువులో అకృత దీక్షతో మరింతగా రాణిస్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చేనేత ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సందా రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విశ్వం ఎడ్యుకేషన్ సొల్యూషన్ ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులకు అబాకస్, వేదిక్ మాథ్స్, జోనల్ సాయి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందా రాఘవ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ జోనల్ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను త్వరలోనే జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పాఠశాల చైర్మన్ కొండన్న, కరెస్పాండెంట్ జనార్ధన్, జోనల్ మేనేజర్ శివాంజనేయులు, విశ్వం తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలి..
RELATED ARTICLES