మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం : విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జివిఇ జెడ్పి ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూఁజన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు విద్యార్థి దశలో ఆచరించదగిన అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో ప్రతిభ ఘనపరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో జి. అలేఖ్య, ఎస్. చరిత, వి. సృజన అనే విద్యార్థులకు పాఠశాల హెడ్మాస్టర్, స్వచ్ఛంద సేవా సంస్థల వారి చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తల్లం నారాయణమూర్తి, సభ్యులు మనోహర్ గుప్తా, రమేష్, కార్యదర్శి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
లయోలా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లోబీబీ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానములలో భవాని, ప్రణవి, మోక్షిత్ వారికి వన్ టౌన్ ఎస్ఐ కేతన చేతులు మీదుగా మెమొంటోస్ సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఎస్సై కేతన్న మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రుల, గురువులకు విలువ కట్టలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరెస్పాండెంట్ శంకర్ నాయుడు, సభ్యులు కోనాపురం సాయిప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.