జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;;ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరిక్షా ఫలితాలు లో ఫెయిల్ అయిన విద్యార్థులు,ఇంప్రూవ్ మెంట్ రాయాలి అనుకున్న విద్యార్థులు ఈనెల 15 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు తమకు సంబంధించిన కళాశాలల యందు పరీక్ష ఫీజును చెల్లించవలెను అని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 12 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరుగుతాయని,తమ పరీక్ష పత్రాలను రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేయించాలని కోరుకున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తాము తెలిపిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీకౌంటింగ్ ఫీజు ఒక పేపర్ కు రూ .260 లు, రీ వెరిఫికేషన్ కొరకు రూ 1300 లు ఆన్లైన్ ద్వారా చెల్లించవలెను అని తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల యందు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ కృతిక శుక్ల ఆదేశాలను అమలుపరచాలని వారు తెలిపారు. కావున అన్ని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లకు సంకల్ప మెటీరియల్ను ఉపయోగించి ఫెయిల్ అయిన విద్యార్థులను మే నెల 12వ తేదీ నుండి జరగబోవు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు తప్పనిసరిగా తర్ఫీదు చేయాలని వారు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులను ఉత్తీర్ణత అగునట్లు తర్ఫీదు తో పాటు బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు.