రూ.లు10,000 జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్ అంజుమాన్ సర్కిల్ లలో గల దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకము, విక్రయాలపై ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలపై నేరుగా వెళ్లి స్టాక్ ఉన్న ప్లాస్టిక్ నిల్వను తనిఖీ చేసి, దుకాణాచారులకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం 70 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకొని, వివిధ దుకాణా దారులకు పదివేల రూపాయలు జరిమానా విధించారు. మున్ముందు ప్లాస్టిక్‌ను విక్రయించిన జరిమానా తో పాటు కేసులు నమోదు చేస్తామని దుకాణా దారులను వారు హెచ్చరించారు. ఇక నిరంతర ప్రక్రియగా ప్లాస్టిక్ క్రయ విక్రయాలపై నిగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శామ్సన్ ,కేశవ, మేస్త్రీ నరసింహులు, పట్టణ సచివాలయ శానిటరీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకము, విక్రయాలపై ఆకస్మిక దాడులు
RELATED ARTICLES