ఫ్లోరిడా తీరంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక
సముద్రంలో కాప్సూల్ చుట్టూ చేరిన డాల్ఫిన్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ కాప్సూల్‌లో నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, నిక్ హేగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు క్షేమంగా భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో దిగారు. ఈ సమయంలో వారికి సముద్రంలో అనుకోని విధంగా స్వాగతం లభించింది. డ్రాగన్ కాప్సూల్ ల్యాండైన వెంటనే.. సముద్రంలోని డాల్ఫిన్‌లు దాని చుట్టూ ఈదుకుంటూ ఎగురుతూ స్వాగతం పలికాయి. ఈ దృశ్యాలను అమెరికా కోస్ట్‌గార్డ్ దళాల నిఘా కెమెరాల్లో రికార్డు కాగా… ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ ావావ్ చాలా బాగుంది్ణ కామెంట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు సైతం ాడాల్ఫిన్లు వ్యోమగాములకు హాయ్ చెప్పాలనుకుంటున్నాయి్ణ అని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఫసిపిక్ తీరంలో డ్రాగన్ సురక్షితంగా దిగిన వెంటనే సముద్రంలో అప్పటికే ఎదురుచూస్తున్న సహాయ బృందాలు క్యాంపుల్స్ ఓ నౌక వద్దకు చేర్చాయి. అనంతరం దానిపైకి తీసుకొచ్చి.. భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించారు. లోపలి ఉన్న వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్దారించుకుని.. ఆ తర్వాత కాప్సూల్‌ను తెరిచి దానిని నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. తదుపరి పరీక్షల కోసం హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. గతేడాది జూన్ 5 న ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు తొమ్మది నెలల (286 రోజులు) పాటు ఐఎస్ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ 286 రోజుల్లో వారు గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌లో వారు ప్రయాణించారు. దీంతో ప్రతి రోజూ 16సార్లు భూప్రదక్షిణలు చేశారు. ఈ లెక్కన రోజుకు వారు 16 సూర్యోదయాలు చూసేవారు. ప్రతి 45 నిమిషాలకోసారి సూర్యోదయం అయ్యేది. మొత్తంగా 4,500 సార్లు వారు పుడమి చుట్టూ తిరిగారు. అలాగే 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లకు పైగా ప్రయాణించారు.
భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్..డాల్ఫిన్లు నుంచే తొలి స్వాగతం..
RELATED ARTICLES