సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; మే నెల ఐదవ తేదీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు పెద్దన్న సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష తెలిపారు. ఈ సందర్భంగా వారు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో అనేకమంది పేదలు, దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడినటువంటి వర్గాల వారు ఇల్లు లేని వారు అనేక చోట్ల కొట్టాలు, గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి వారికి ప్రభుత్వం ఇంటి స్థలాలను మంజూరు చేసి, ఇండ్లను కట్టించాలని వారు తెలిపారు. జిల్లాలో 20 సంవత్సరాల కిందట మడకశిర లేపాక్షి ప్రాంతాలలో సెట్ రసాయన పేరుతో లేపాక్షి హట్టు పేరుతో వేల ఎకరాల పరిశ్రమల పేరుతో ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఇంతవరకు పరిశ్రమలు ఏర్పాటు చేయక రైతులు పరిశ్రమల్లో ఇచ్చిన భూములలో, అదే రైతు సాగు చేస్తున్నారు అని, వారికి ఆన్లైన్లో రైతుల పేర్లు పొందుపరిచి పాసుబుక్కులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో త్రాగునీరు, రోడ్లు, వీధిలైట్లు ,ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు, హంద్రీనీవా పదివేల సెక్యులర్ సామర్థ్యంతో కాలువలు వెడల్పు చేయాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని చెరువులకు నీటితో నింపి ఆయకట్టు ఏర్పాటు చేసి కాలువ లైనింగ్ పనులను ఆపి తదితర సమస్యల పైన కలెక్టర్ కార్యాలయం వద్ద మే 5వ తేదీన ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ ధర్నాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్మికులు, కర్షకులు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శులు ఆదినారాయణ, హైదర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.
మే 5న నిర్వహించబడే కలెక్టర్ కార్యాలయ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయండి..
RELATED ARTICLES