ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పును కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని పేర్కొంది.
ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
RELATED ARTICLES