మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి
విశాలాంధ్ర ధర్మవరం;; అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు అని మండల న్యాయవిజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం ఎర్రోనా పల్లి గ్రామంలో ఆర్డిటి ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం జడ్జి గీతావాణి, ఆర్డిటి రీజినల్ డైరెక్టర్ ప్రమీల కుమారి లు మాట్లాడుతూ
శ్రీ సత్య సాయి జిల్లా ను బాలల స్నేహ జిల్లా గా ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని తెలిపారు.
బాల్య వివాహాలకు దూరంగా ఉండండి, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తో పాటు ఆర్ డి టి రిజినల్ డైరెక్టర్ ప్రమీల కుమారి , జునియర్ సివిల్ జర్జి పి.వి.హరీష్ , రామగిరి సి ఐ శ్రీధర్ హాజరు కావడం జరిగింది. బాలలను కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిది అలాగే బాలలు కుడా తమ హక్కులను భాధ్యతలను తెలుసుకొని నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా భవిషత్తు లో ప్రతి ఒక్కరు అత్యన్నత స్థాయికి ఎదగాలని తెలుపుతూ చేన్నేకొత్తపల్లి మండలాన్ని బాలల సమస్యలు లేని మండలముగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అలాగే ప్రస్తుత సమాజంలో ఎదురైయ్యే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా, మండల న్యాయ సేవా అధికార సంస్థలు ప్రతి నెల గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సేవలు గురించి తెలియజేస్తుంది అని తెలిపారు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురిఅవుతున్నారు కాని తక్కువ గా జరుగుతున్నాయని తెలిపారు. అవుతున్నాయి ధైర్యంగా ముందుకొచ్చి పిర్యాదు చేస్తే పిఓసిఎస్ఓ చట్టం 2012 ప్రకారం నేర తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా భాధితులకు ఉచితంగా న్యాయవాదిని ప్రభుత్వ మే ఏర్పాటుచేస్తుందని, అంతే కాకుండా నేరారోపణ ఎదుర్కొంటున్న వారికి కుడా ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని తెలిపారు. ఇలాంటి ఉచిత సేవలు పొందాలంటే ఒక సంవత్సరానికి మూడు లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు. ఖైదీల సంక్షేమం కోసం ప్రతి నెల ధర్మవరం సబ్ జైలు సందర్శించి వారి బాగోగులు తెలుసుకొని వారి ప్రవర్తనలో మార్పు కోసం ప్రయత్నం చేయడం జరుగుతోందని తెలిపారు.
ఆర్ డి టి సంస్థ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలతో కలసి ముందస్తు చర్యగా అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేసి, పిల్లలకు , తల్లిదండ్రులకు ప్రస్తుత సమాజంలో పిల్లలకున్న సమస్యల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి అమ్మాయి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాటిని చేరుకోవడానికి నిరంతరం సాధన చేయాలి అని తెలిపారు. మద్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలకు లోనుకాకుండా ముందుకు సాగినపుడే అనుకున్న లక్ష్యంను జీవితంలో చేరుకుంటారని తెలియజేసినారు. ప్రస్తుతం బాలికలు నేటి సమాజంలోఎక్కడ చూసినా చిన్న, చిన్న సరదాలకోసం ఆకతాయిల వలలో పడి, ఒక వైపు తల్లిదండ్రుల కష్టాన్ని మరచి, మరో వైపు తమ జీవిత లక్ష్యాన్ని మరచి, అతి పిన్న వయసులోనే తమ జీవితాలని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు అని తెలిపారు. కావున ఎలాంటి ఆకర్షణలకు గురి కాకుండా తమ జీవితాన్ని వారే పరిరక్షించుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలత్రిపుర సుందరి, చరణ్, హేమంత్, ఆర్ డి టి మహిళా అభివృద్ధి విభాగం టీం లీడర్ ఆదినారాయణ, ఏరియా టీం లీడర్ శ్రీనివాసులు, సిబ్బంది శారద, మురళి,గితావాణి, ప్రధానోపాధ్యాయులు మంజులా వాణి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు..
RELATED ARTICLES