Homeక్రీడలుసూర్యకుమార్‌పై వేటు!

సూర్యకుమార్‌పై వేటు!

- Advertisement -

టీ20 కెప్టెన్సీ రేసులో శ్రేయస్
ముంబై
: టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడం ఖాయమని తెలుస్తోంది. కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నాడు. సూర్యను తప్పించే విషయంలో సెలక్టర్లు, కోచ్ గంభీర్‌ల అభిప్రాయం గురించి బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా…బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు వివరించనున్నట్లు సమాచారం. ‘టీ20 కెప్టెన్‌గా సూర్యను తప్పించనున్నారు. ఐపీఎల్‌లోనైనా అతడు ఫామ్‌ను అందుకుంటాడేమోనని సెలక్టర్లు భావించారు. కానీ అతడు ఏమాత్రం ఫామ్‌లో లేడు. కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. కెప్టెన్సీ కోల్పోతే…సూర్యకు జట్టులో కూడా స్థానం దొరికే అవకాశం లేదు. ఏడాదిన్నర నుంచి బ్యాటర్‌గా అతడు పేలవ ఫామ్‌లో ఉన్నాడు. సూర్య ఇప్పటివరకు 113 టీ20ల్లో 36.35 సగటు, 162.94 స్ట్రైక్‌రేట్‌తో 3,272 పరుగులు చేశాడు. కానీ 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 35 మ్యాచ్‌ల్లో 26 సగటుతో 702 పరుగులు మాత్రమే సాధించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడే భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌లు (ఈ నెల26, 28) ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు అంశం తెరపైకి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు