మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి…
విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయల అన్నిటిలో నిర్వహించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు నందిగామ శాసనసభ్యుల వారి కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కమిషనర్ ఈవి రమణ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ ని శాశ్వతంగా నిషేదిద్దామని మనం నిత్యం వాడే అవసరాల కోసం ప్లాస్టిక్ కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలను సూచించారు నిత్యవసరాలలో భాగంగా ఎన్నో రకాలుగా కవర్లు వాడుతున్నామని వాటి ప్లేస్ లో క్లాత్ బ్యాగులను వాడాలని దాని ద్వారా భావితరాల ఆరోగ్య ప్రదాతలు గా నిలుస్తామని అన్నారు నందిగామ మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన రహదారి మీదుగా బాబు జగజ్జీవన్ రావ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి జగజ్జీవన్ రావ్ భవన్ నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి వచ్చిన అందరితో ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ ప్రేమికులను దృశ్యాలవాలతో సన్మానించారు అంతకుముందు నందిగామ దేవినేని వెంకటరమణ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావుతో కలిసి హాస్పటల్ ప్రాంగణమంతా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సురేష్ బాబు, మున్సిపల్ ఏఈ పని శ్రీనివాసరావు, కాకతీయ అపోలో విద్యాసంస్థల అధినేత కాపా రవీంద్రబాబు,పట్టణ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ,హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు,కూటమి నేతలు,వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…