Friday, February 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రత్యేక ఆధార్ శిబిరాలు సద్వినియోగం చేసుకోండి.. ఎంపీడీవో సాయి మనోహర్

ప్రత్యేక ఆధార్ శిబిరాలు సద్వినియోగం చేసుకోండి.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని 9 గ్రామ పంచాయతీలలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు, తదుపరి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావులచెరువు గ్రామపంచాయతీ లోని గ్రామ సచివాలయం లో ఈనెల 18, 19 తేదీలు, మల్లా కాలువ, ధర్మపురి పంచాయతీలలో మల్లా కాలువ లో ఈనెల 20వ తేదీ, తుమ్మల అండ్ సుబ్బారావుపేట గ్రామపంచాయతీలకు తుమ్మల గ్రామ సచివాలయంలో ఈనెల 21వ తేదీ, గొట్లూరు-1 అండ్ 2 గ్రామ పంచాయతీలలో గొట్లూరు ఒకటిలో ఈనెల 24వ తేదీ, చికిచెర్ల గ్రామపంచాయతీలో ఈనెల 25వ తేదీ, కొనుతూరు, పోతుకుంట గ్రామపంచాయతీలలో పోతుకుంట గ్రామపంచాయతీలో ఈనెల 27వ తేదీ, రేగాటి పల్లి సీసీ కొత్తకోట గ్రామపంచాయతీలకు పోతుల నాగేపల్లి గ్రామ సచివాలయంలో ఈనెల 28వ తేదీన ఉంటుందని తెలిపారు. ప్రతి సచివాలయంలో జీరో నుండి 6 సంవత్సరాలు ఉన్నవారు ను ఎన్రోల్మెంట్ చేయాలని, ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల పిల్లలను తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు