ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధి లో గల శ్రీ శాంత కళాచౌడేశ్వరి ఆలయ ఆవరణంలో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 19వ ఉచిత వైద్య చికిత్స శిబిరము నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి నిర్వాహకులు (కమిటీ) తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరాలు పేద ప్రజల ఆరోగ్యమును దృష్టిలో ఉంచుకొని నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులైన డాక్టర్ వివేక్ కుల్ల యప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు ,డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీపునేత, డాక్టర్ విట్టల్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ వైద్యుల ద్వారా రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా తెరుపబడుతుందని తెలిపారు. శిబిర దాతగా కీర్తిశేషులుదాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జ్ఞాపకార్థం వీరి కుమారులు దాసరి మంజునాథ్ అండ్ సన్స్ దాసరి ప్రమీల కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రతినెలా 200 మందికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ఒక్కొక్కరికి 200 రూపాయలు పెన్షన్ కూడా అందజేయడం జరుగుతోందని తెలిపారు. కావున పట్టణంలోని, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలముగా ఉంచుకోవాలని తెలిపారు.
109 వఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి
RELATED ARTICLES