Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబిసిఎ కోర్సును సద్వినియోగం చేసుకోండి .. ప్రిన్సిపాల్ హర్షవర్ధన్

బిసిఎ కోర్సును సద్వినియోగం చేసుకోండి .. ప్రిన్సిపాల్ హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు 2025- 26విద్యా సంవత్సరం నుండి బి సి ఎ కోర్సును ప్రారంభిస్తునామని కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి ,ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పోటీప్రపంచంలో బిటెక్ చేసిన విద్యార్థులతో సమానంగా బిసిఎ విద్యార్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ఈ గ్రూపుకు ఇంటర్ నందు ఎంపీసీ, బైపీసీ, ఎమ్యిసీ, సియిసి, హెచ్యిసి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ధర్మవరం పట్టణ, పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ కోర్సును సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు