Monday, April 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివేసవి ఉచిత చదరంగం శిక్షణ శిబిరం ను సద్వినియోగం చేసుకోండి..

వేసవి ఉచిత చదరంగం శిక్షణ శిబిరం ను సద్వినియోగం చేసుకోండి..

కళాజ్యోతి పాలకవర్గం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో (డీఎస్పీ కార్యాలయం ఎదురుగా) కళాజ్యోతి సహకారంతో వేసవి ఉచిత చదరంగం (చెస్) శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కళాజ్యోతి చెస్ సంబంధించిన డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సింగనమల రామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వేసవి ఉచిత చదరంగ శిక్షణాలు గత 8 సంవత్సరములుగా కళా జ్యోతి యందు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరం ఈనెల 25వ తేదీ నుండి మే నెల 25 వరకు 30 రోజులు పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చెస్ నేర్చుకోవడానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు నిండి ఉండాలని, 30 రోజుల తర్వాత శిబిరమునకు వచ్చిన క్రీడాకారులకు ఒక చదరంగం టోర్నమెంట్ కూడా నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 91770320752 సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు