విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల నందు పాలిసెట్, ఏపీఆర్జేసీ, ఆర్డీసీసెట్, గురుకుల్ ప్రవేశ పరీక్షలకు నిష్ణాతులచే ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత శిక్షణ నందు విద్యార్థులకు షార్ట్ కట్ మెథడ్స్ , గ్రాండ్ టెస్ట్ లను నిర్వహించటంతో పాటుగా స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వబడును అని వారు తెలిపారు. తరగతులు ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం అవుతాయని,ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 4వ తేదీ లోగా నమోదు చేసుకోవాలి అని తెలిపారు.మరిన్ని వివరాలకు, 6305636255 లేదా 9912679876 నెంబరు సంప్రదించవలసినదిగా వారు తెలిపారు. సేవాభావం గల ప్రభుత్వ అధ్యాపకులు, రిటైర్డ్ అధ్యాపకులు వారి అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవటానికి తమ కళాశాల తరపున ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి.. ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
RELATED ARTICLES