షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఈనెల ఆరవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు వీరనారాయణ, కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు టిసి. నారాయణరెడ్డి, కోశాధికారి సూర్యనారాయణ, డైరెక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరము శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి- ధర్మవరం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ -శ్రీ సత్యసాయి జిల్లా, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారిచే నిర్వహించబడునని తెలిపారు. కంటి సంబంధిత సమస్యలు వైద్య నిపుణులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉచితముగా కంటి ఆపరేషన్లను కడప పుష్పగిరి కంటి ఆసిపత్రి యందు నిర్వహిస్తామని తెలిపారు. కంటి నిపుణులతో కంటికి ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని, ఆపరేషన్ ఎంపికైన వారికి భోజనము, వసతి, ఇతర సౌకర్యములు కూడా ఉచితంగా కల్పించబడునని తెలిపారు. కంటి వైద్య పరీక్షలకు వచ్చువారు ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డు ,ఆధార్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ఈ శిబిరంలో చిన్న పిల్లలకు వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సాయిబాబా ఆలయ కమిటీ వారి వద్ద గాని, లక్ష్మణ్ సెల్ నెంబర్ 8074675239 కు గాని సంప్రదించాలని తెలిపారు.
ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
RELATED ARTICLES