ఎక్సైజ్ డిపి ఈవో గోవింద నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పుట్టపర్తి డిపి ఈవో గోవింద నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు ఫైలను కూడా వారు తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నవోదయ 2.0 లో మొదటి దశ పూర్తి కావడం జరిగిందని, రెండవ దశ లో కేసులు బనాయించడం, నాటు సారా లేకుండా పూర్తి దశలో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఎక్కడినుండి కూడా ఫిర్యాదులు అందితే హుటాహుటిన సమస్యను పరిష్కరించి కేసులను నమోదు చేయాలన్నారు. మొత్తం నవోదయ 2.0 లో నాలుగు దశలు ఉన్నాయని తెలిపారు. బైండోవర్సపై పూర్తి శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం అధికారులు సిబ్బంది తప్పనిసరిగా తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి డిటిఎఫ్ హరికృష్ణ, ఎక్సైజ్ సీఐ చంద్రమణి,స్థానిక ఎక్సైజ్ ఎస్ఐలు నాగరాజు, చాంద్ బాషా సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారా లేకుండా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టండి..
RELATED ARTICLES