ఆర్ డి ఓ కు, తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేసిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని ఏపీపీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఆర్టీసీ) సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్డిఓ మహేష్ కు, తాసిల్దార్ నటరాజుకు వినతి పత్రాన్ని నాయకులు అందజేశా రు. అనంతరం జోనల్ ఉపాధ్యక్షులు శేఖర్, జిల్లా చైర్మన్ ముత్యాలప్ప, రీజినల్ నాయకులు శంకరయ్య ,డిపో కార్యదర్శి మధుసూదన్ తదితరులు మాట్లాడుతూ సెంట్రల్ కమిటీ నిర్ణయం మేరకు ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి దాదాపు 6 నెలలు పైబడి తీసుకుని వచ్చినప్పటికీ, కనీసం పరిష్కారం చెరువు కూడా చూపించకపోగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2019 సర్కులర్ను మా డిపో నందు అమలు జరిపించాలని, డ్యూటీలు లేవని బలవంతంగా లీవ్ వేయకుండా కేంద్ర కార్యాలయం ఇచ్చి ఉన్న సర్కులర్ ను అమలు జరిపించాలని, మహిళా సిబ్బందికి ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైన సెలవులు మంజూరు చేయాలని, రిటైర్డ్ అయిన సిబ్బందికి ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్ అమలు చేయాలని తెలిపారు. క్లారికల్ సిబ్బందికి అవసరమాకు కంప్యూటర్స్ ప్రింటర్స్ తో పాటు కావలసిన ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలని, పనిగంటలకు మించి పనిచేస్తూ వారిపై పెంచిన భారమును తగ్గించాలని తెలిపారు. కొత్త బస్సులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ వారు అమలు చేసిన వైద్యమును మరింత మెరుగుపరచాలని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధి పనులు వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఆర్టీసీ సంస్థలో పెండింగ్లో ఉన్న ఖాళీలను బట్టితో పాటు ప్రమోషన్లు కూడా వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో కోశాధికారి వైవిఆర్ రెడ్డి, రాయుడు, హరికృష్ణ, మంజునాథ్, ప్రసాద్, నరసింహులు, తదితర సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టండి..
RELATED ARTICLES