Saturday, January 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ మీటర్స్ లీడర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి

విద్యుత్ మీటర్స్ లీడర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి

ఏఐటీయూసీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని విద్యుత్ శాఖ ఏడికి విద్యుత్ మీటర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, నాయకులు రమణ, బాబావలి, జగదీష్ కుమార్, బాలశివలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకటే విస్కీమ్లో రెండు పనులు చేయడం వల్ల చెడ్డ విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తూ మీటర్ రీడింగ్ తీస్తున్న ముగ్గురు వ్యక్తులకు మీటర్ రీడింగ్ నుంచి తీసివేయాలని వారు కోరారు. తీసివేయకపోతే జనవరి 5న మీటర్ రీడర్స్ అందరూ కలిసి సమ్మెకు సిద్ధం కావాలని తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్స్ పని దినాలను పెంచాలని, ఏస్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు