విశాలాంధ్ర- ధర్మవరం : 2024-25 అకాడమిక్ సంవత్సరం లో నిర్వహించినటు వంటి క్రీడల్లో ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. శైలజ ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూబాల్ బాడ్మింటన్ అండర్/14 ఆశోక్, మనోజ్, రాయచోటి జిల్లా మదనపల్లి అండర్/17 సాయి ప్రసాద్ రాజమండ్రి కైవసం చేసుకోగా,టేబుల్ టెన్నిస్ విభాగంలో అండర్/14 ఆశోక్ నంద్యాల , అండర్/17 మధు నంద్యాల,అండర్/19 పవన్ కుమార్ విజయవాడ,బాస్కెట్ బాల్ విభాగంలో అండర్/14 శశిధర్ పల్నాడు జిల్లా నరసరావుపేట, అండర్/17 కార్తీక్ నాయక్, లక్ష్మి నరసింహ పశ్చిమ గోదావరి జిల్లా మారతేరు, అదేవిధంగా నెట్ బాల్ లో అండర్/17 సాయికుమార్ నెల్లూరు జిల్లా ఆత్మకూర్,అలాగే
అసోసియేషన్ గేమ్స్ లో బాస్కెట్ బాల్ లో లక్ష్మి నరసింహ, కార్తీక్ నాయక్ రాగా,
బాల్ బాడ్మింటన్ లో చిరంజీవి, మనోజ్, ఆశోక్, నిఖిల్ రాగా,షూటింగ్ బాల్ లో చరణ్ రాణించడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయి లో పాల్గొని అనంతపురం జిల్లా తరఫున రాణించడం లో విద్యార్థులను తీర్చి దిద్దిన ఫిజికల్ డైరెక్టర్ వి. నాగేంద్ర నైపుణ్యం కనబరచిన విద్యార్థులను అభినందించారు. తదుపరి పాఠశాల ఉపాధ్యా యులైన వేణుగోపాల్ , శ్రీనివాసులు, హేమలత, లలితమ్మ,ప్రసాద్ బాబు, సునీతమ్మ, నాగరాజు, రామకృష్ణారెడ్డి,భాస్కర్ చంద్ర, హరికృష్ణ,శ్రీ లత, శ్రీనివాసులు, రఫిక్ అహ్మద్, దివాకర్, నాగేంద్ర తదితర ఉపాధ్యాయ బృందం అందరూ విద్యార్థులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES