Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి పాలీ టెక్ ఫెస్ట్ 2024-25 పోటీలో కదిరి విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి పాలీ టెక్ ఫెస్ట్ 2024-25 పోటీలో కదిరి విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర, కదిరి : రాష్ట్రస్థాయి పాలీ టెక్ ఫెస్ట్ 2024-25 పోటీలో కదిరి విద్యార్థుల ప్రతిభ కనపరిచ్చినట్లు ప్రిన్సిపాల్ రమా తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన పాలీ టెక్ ఫెస్ట్ 2024-25 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఫైనల్ ఇయర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శించిన ఫైర్ ఫైటింగ్, రోబోట్ వినూతన ఆవిష్కరణకు రాష్ట్ర
వ్యాప్తంగా మూడో బహుమతి కి ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చేతుల మీదుగా 25 వేల రూపాయలు నగదు మెరిట్ సర్టిఫికిట్ ను కే.మణికంట,జి.యువరాజు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కే.రమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ హెడ్.ఎం,చంద్రశేఖర్ రెడ్డి కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు