విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత కావడం జరిగిందని హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 215 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 127 మంది ఉత్తీర్ణులు కావడంతో 59 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. 500 మార్కులకు పైగా 36 మంది విద్యార్థులు రావడం జరిగిందన్నారు. ఇందులో కె. గౌతం కృష్ణ 593 మార్కులలో ప్రథమ స్థానంలో రాగా, కె విష్ణువర్ధన్, ఎస్. కలీముల్లా అను ఇరువురు విద్యార్థులు 587 మార్కులతో ద్వితీయ స్థానంలో రాగా, జె నందు 584 మార్కులతో తృతీయ స్థానంలో నిలవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది తల్లిదండ్రులు పాఠశాల కమిటీ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులందరికీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES