Monday, March 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ధర్మవరంలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి,కేక్ కట్ చేసిన పరిటాల శ్రీరామ్

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి చూపిస్తాం ..పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాలశ్రీరామ్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొని జరుపుకున్నారు.,పట్టణం లోని ఎన్టీఆర్ సర్కిల్లో గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలతో ఘనంగా నివాళులర్పించిన అనంతరం పట్టణ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించి, పార్టీ నినాదాలు మధ్య ఎన్టీఆర్ పరిటాల రవీంద్ర చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతి పరిస్థితులను పూర్తిగా విశ్లేషిస్తూ ప్రతి పేదోడికి కూడు, గుడ్డ, గూడు నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అతి సామాన్యులకు సైతం రాజకీయ అవకాశం కల్పించి ప్రజా చైతన్యానికి పెద్దపీట నందమూరి తారక రామారావు నని కొనియాడుతూ,ఇక మున్ముందు నిత్యం ప్రజలతో మమేకమై కార్యకర్తలే పార్టీపరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి,సంక్షేమంలో ముందుకు తీసుకు వెళుతున్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందనితెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు