Homeజిల్లాలుకర్నూలుఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బోయ భీమన్న, బోయ కాసిం, బోయ బుల్లెప్ప, మాజీ డీలర్ భీమేష్, హరిజన బజారి, దేవదానం, కొలిమి రంగన్న, ఏసన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శాంతప్ప, జనసేన నాయకులు బజారి, హుసేని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు