విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ గేటు ముందు బాగాన గత కొన్ని రోజులుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామకు భారతరత్న అవార్డు ఇవ్వాలని దీక్షలు చేపట్టిన పట్టుచీరల పాలిష్ కార్మికుడు నరసింహులు టిడిపి నాయకులు తలారి చంద్రమోహన్ ముత్యాలు తారక్ తదితరులు ఆ చేనేత కార్మికునికి మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని, ఈ దీక్షకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్టు వారు తెలిపారు. 17 రోజులుగా చేస్తున్న నరసింహులు దీక్ష కొనసాగుతుండడంతో ప్రతిరోజు ఎంతోమంది మద్దతుదారులు మద్దతు ఇస్తున్నారు. నరసింహులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇచ్చేంతవరకు నా దీక్షలను నిరంతరం కొనసాగిస్తానని వారు స్పష్టం చేశారు.
దీక్షకు మద్దతు తెలిపిన టిడిపి నాయకులు
RELATED ARTICLES