పదో తరగతి ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం (ఏప్రిల్ 30) టీఎస్ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడి కానున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు TS SSC Results ఎంతో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ TS 10th ఫలితాలను ఏప్రిల్ 30న ప్రకటించనుంది. మరోవైపు ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కులు ఇవ్వనున్నారు. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ TS SSC మార్కులను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లేదా https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.