Homeతెలంగాణతెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

- Advertisement -

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షలో మొత్తం 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు. బానోత్ అజిత్ సాయి ప్రథమ ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు. ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు అర్హులు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు