ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు
విశాలాంద్ర, పార్వతీపురం: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారంనాడు పార్వతీపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం
RELATED ARTICLES