Monday, May 5, 2025
Homeఆంధ్రప్రదేశ్హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం కేసులో పదిమంది అరెస్టు

హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం కేసులో పదిమంది అరెస్టు

విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లిలో ఏప్రిల్ నెలలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా, అప్పట్లో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుంచి నిందితుల కోసం చెన్నై కొత్తపల్లి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం పదిమందిని నిందితులను అరెస్టు చేసి ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. విచారించిన జడ్జి రిమాండ్కు పంపడం జరిగిందని చెన్నై కొత్తపల్లి పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని కూడా త్వరలో అరెస్టు చేస్తామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు