Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ఖాళీ స్థలములకు టెండర్లు.. డిపో మేనేజర్ సత్యనారాయణ

ఆర్టీసీ ఖాళీ స్థలములకు టెండర్లు.. డిపో మేనేజర్ సత్యనారాయణ

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఖాళీ స్థలములకు టెండర్లను ఆసక్తిగల వ్యాపారస్తుల నుండి కోరుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి షాపులకు 5 సంవత్సరాల గడువుతో వ్యాపార నిర్వహణకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండులో ఐదు ఖాళీ స్థలములకు బేకరీ స్వీట్ షాప్, టీ, కాఫీ బిస్కెట్ షాప్, జిమ్ సెంటర్ లాంటి వ్యాపారాలను నడుపుకోవచ్చునని తెలిపారు. టెండర్ దరఖాస్తుకు రూ .10,000రూపాయల నుండి 20,000, 26,000, 32,000, 1,01,000(ఆయా షాపులను బట్టి ధర) చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈనెల 26వ తేదీ వరకు డిపో మేనేజర్ ధర్మవరం నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.885 లు చెల్లించి టెండర్ ఫారం ను పొందవచ్చునని తెలిపారు. పూరించిన టెండర్ ఫారం ను ఈనెల 27వ తేదీ గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం పుట్టపర్తి నందు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు టెండర్ బాక్స్ నందు వేయవలెనని తెలిపారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరవబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959 225859 కు గాని, 6303151302 కు గాని, 73828605012 గాని సంప్రదించవచ్చు అని తెలిపారు. కావున ఆసక్తి గల వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని అవకాశం కలదని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు