సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; జమ్మూ కాశ్మీర్ లోని వహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదని అన్నారు.పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి, దేశ శాంతి భద్రతలను భంగ పరిచే విదంగా ఉందని, రాజకీయాలకు అతీతంగా, ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని వారి స్పష్టం చేశారు. బాధితులకు తగిన న్యాయం జరిగే విదంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ,భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకులపై ఉగ్రవాద దాడి హేయమైన చర్య
RELATED ARTICLES