థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం
శశిథరూర్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఉదిత్ రాజ్ ఆరోపణ
భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఃఆపరేషన్ సిందూర్ః అనంతరం భారత్ చేపట్టిన విస్తృత దౌత్య కార్యక్రమాల్లో భాగంగా భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆయన, బుధవారం పనామా నగరంలో జరిగిన ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను ఎదుర్కొందని, ఈ బాధను, నష్టాన్ని భరిస్తూ అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవడం ఇకపై ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఁమాపై ఏం జరుగుతుందో చూడండి. మాకు సాయం చేయండి, నేరస్థులను గుర్తించి శిక్షించేలా ఒత్తిడి తీసుకురండని అడగడం ఇక సరికాదుఁ అని ఆయన అన్నారు.
2008 ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావిస్తూ, ఁమా వద్ద అన్ని ఆధారాలున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారి ప్రాణత్యాగం చేసి మరీ ప్రాణాలతో పట్టుకున్నారు. అతడిని, పాకిస్థాన్‌లోని అతడి ఇంటిని, చిరునామాను, గ్రామాన్ని గుర్తించారు. భారత్‌తో పాటు పాశ్చాత్య నిఘా సంస్థల వద్ద కూడా ముంబైలో హంతకులకు పాకిస్థానీ హ్యాండ్లర్ నిమిష నిమిషానికి సూచనలిచ్చిన భయంకరమైన సంభాషణల రికార్డింగ్‌లు ఉన్నాయి. దాడులు జరుగుతున్నప్పుడే అన్ని ఆధారాలు సేకరించి, నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఏం జరిగింది? ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒక్కరినైనా విచారించారా, శిక్షించారా? అంటే లేదనే చెప్పాలి. పాకిస్థాన్ దురదృష్టవశాత్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఎంచుకుందిఁ అని థరూర్ వివరించారు.
అయితే, ఇటీవలి సంవత్సరాలలో పరిస్థితి మారిందని, ఉగ్రవాదులు కూడా తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించారని శశిథరూర్ పేర్కొన్నారు.
ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రశంసగా భావించే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఁఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 2015 సెప్టెంబర్‌లో జరిగిన ఉరి దాడి అనంతరం, భారత్ తొలిసారిగా నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద స్థావరంపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇది మనం గతంలో చేయనిదిఁ అని ఆయన గుర్తుచేశారు.
ఁకార్గిల్ యుద్ధ సమయంలో కూడా మనం నియంత్రణ రేఖను దాటలేదు. కానీ యూరి విషయంలో దాటాం. ఆ తర్వాత 2019 జనవరిలో పుల్వామా దాడి జరిగింది. ఈసారి మనం నియంత్రణ రేఖనే కాకుండా, అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లోని ఉగ్రవాద ప్రధాన కార్యాలయంపై దాడి చేశాం. ఈసారి మనం ఆ రెండింటినీ మించిపోయాం. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దును దాటడమే కాకుండా, పాకిస్థాన్ పంజాబీ హృదయభూమిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేశాంఁ అని థరూర్ తెలిపారు.
ఁమా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఃఆపరేషన్ సిందూర్ః అవసరమైంది, ఎందుకంటే ఈ ఉగ్రవాదులు వచ్చి 26 మంది మహిళల నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచివేసి, వారి భర్తలను దూరం చేశారు. నిజానికి, కొంతమంది మహిళలు ఃనన్ను కూడా చంపండిః అని ఉగ్రవాదులను వేడుకున్నారు. కానీ వారు, ఃలేదు, వెనక్కి వెళ్లి మీకు జరిగిన దాన్ని చెప్పండిః అన్నారు. వారి ఆక్రందనలు మేము విన్నాం. మన మహిళల నుదుటిపై ఉన్న సిందూరం రంగు, హంతకుల, నేరస్థుల, దాడి చేసినవారి రక్తం రంగుతో సరిపోలాలని భారత్ నిర్ణయించుకుందిఁ అని థరూర్ ఉద్ఘాటించారు.
తీవ్రంగా స్పందించిన అదిష్ఠానం
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో థరూర్ వివిధ ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రకటనలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. విదేశాలకు న్యూఢిల్లీ సందేశాన్ని తీసుకెళుతున్న ఏడు భారత ప్రతినిధి బృందాలలో ఒకదానికి శశిథరూర్‌ను ఎంపిక చేయడం కూడా వివాదానికి దారితీసింది. ప్రభుత్వానికి తాము సూచించిన నలుగురు ఎంపీలలో ఆయన లేరని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది. దీనిపై శశిథరూర్ స్పందిస్తూ, తన సామర్థ్యాలపై వారి అభిప్రాయం చెప్పే హక్కు పార్టీ నాయకత్వానికి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు.
తాజాగా థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీ సహచరుడు ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఁకాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీకి సూపర్ స్పోక్స్‌పర్సన్. బీజేపీ నేతలు కూడా చెప్పని విధంగా ఆయన మోదీజీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసేవో ఆయనకు తెలుసా? భారత సాయుధ బలగాల ఘనతను వీరు (కేంద్ర ప్రభుత్వం) తమ ఖాతాలో వేసుకుంటున్నారు. శశిథరూర్ బీజేపీ ప్రచార విన్యాసాలకు ప్రతినిధిగా మారారుఁ అని ఉదిత్ రాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విమర్శించారు.