ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశగాల్ల వెంకటేష్.
విశాలాంధ్ర ధర్మవరం ; ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీవ్ రంజాన్ మిశ్రా పంపిన ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశగాల్ల వెంకటేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సోలిగాళ్ళ శ్రీనివాసులతోపాటు పలువురు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ ముగింపునకు ప్రధానికి కృతజ్ఞతలు
RELATED ARTICLES