రాష్ట్ర చేనేత నాయకురాలు సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శివానగర్లో గల శివాలయ ఆవరణంలో ఈనెల నాలుగవ తేదీన నిర్వహించిన చేనేత ఐక్య కులం చెందిన, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సన్మాన సభను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 20 రోజులుగా తాము ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎన్నో ప్రయాసాలను పడ్డామని, అందరి సహాయ సహకారాలతో సన్మాన సభను విజయవంతం చేయడం పెట్ల మాకెంతో సంతోషము, తృప్తిని ఇచ్చిందని తెలిపారు. దాదాపు 7 కులాలకు పైగా వచ్చిన చేనేత కులాల వారికి, ఆంధ్రప్రదేశ్ నుండి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి, వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన వారికి, నాయకులకు, చేనేత కార్మికులకు పేరుపేరునా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఇక చేనేత పరిశ్రమను కాపాడుకునే దిశలో తాము అడుగు పెడతామని తెలిపారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేనేత సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే పటానికి అవకాశం ఉందని, వారు కూడా ఐక్య చేనేత కులాలకు, చేనేత పరిశ్రమకు తప్పక న్యాయం చేస్తానన్న ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారీ ఎత్తున ఈ సన్మాన సభ విజయవంతం కావడం, మాకు పునాది లాంటిదని, మున్ముందు చేనేత సమస్యలపై నెలవారీగా అందరూ కూర్చొని చర్చించడం జరుగుతుందని తెలిపారు
చేనేత ఐక్య కులాల సన్మాన సభను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు..
RELATED ARTICLES